taapsee-pannu-says-she-spends-rs-1-lakh-month-her-dietician
mictv telugu

డైటీషియన్ కు నెలకు లక్ష ఇస్తున్న తాప్సీ

March 17, 2023

taapsee-pannu-says-she-spends-rs-1-lakh-month-her-dietician

అనుకుంటాం కానీ యాక్టర్స్ జీవితాలు కత్తిమీద సాముల్లాంటివి. వాళ్ళు ఏ మాత్రం తమ మీద తాము శ్రద్ధ పెట్టకపోయినా వాళ్ళ లైఫ్ మొతతం స్పాయిల్ అయిపోతుంది. హీరోయిన్ గా ఛాన్స్ లు దక్కించుకోవడం కాదు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం.. ఆడియన్స్ లో ఏర్పడిన ఇమేజ్ ని కాపాడుకోవడం కూడా వాళ్ల మీద ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ అంటే ఎప్పుడూ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని మెప్పించే అందంతో ఉండాలి. దానికి పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

ఎలా పడితే అలా.. ఏది పడితే అది తినేస్తే శరీరం అడ్డదిడ్డంగా పెరిగిపోతుంది.అందం అంతా పోతుంది. అందుకే కథానాయికలు స్పెషల్ డైట్ లు తింటుంటారు. దానికి కోసం స్పెషల్ గా డైటీషియస్లను, షెఫ్ లను కూడా పెట్టుకుంటుంటారు. ఈ క్రమంలో తన డైటీషియన్ ఖర్చు గురించి చెప్పి సర్ ప్రైజ్ చేసింది తాప్సీ పన్ను.

తను నెలకు లక్ష రూపాయలు డైటీషియన్ కి ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చింది. తన తండ్రికి ఇష్టం లేకపోయినా సరే వాటిని ఖర్చు పెడతాను అంటుంది. డబ్బు విషయంలో అందరి తండ్రుల్లానే తన ఫాదర్ కూడా ఆలోచిస్తారని చెప్పుకొచ్చింది. తన కోసం డబ్బు ఖర్చు పెట్టమని ఆయనతో చెప్పడం చాలా కష్టమని.. అయితే డైటీషియన్ అనేది నేను చేస్తున్న వృత్తికి చాలా అవసరమని.. అందుకోసం దానికి తగిన మొత్తాన్ని ఖర్చు పెడుతున్నానని అన్నారు తాప్సీ.

సినిమాలో చేస్తున్న పాత్రని బట్టి అందుకు తగినట్టుగా కనిపించేందుకు డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుందని.. దాన్ని బట్టి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు తాప్సీ. తను మాత్రమే కాదు డైజేషన్ ప్రాబ్లం వల్ల తాప్సీ మదర్ కూడా డైటీషియన్ ను పెట్టుకున్నారుట. ఏదైనా అనుకున్న దాన్ని సాధించేవరకు తాను వదిలిపెట్టనని, తన పేరెంట్స్ తనని అలా పెంచారని అన్నారు. తాప్సీ,షారుఖ్ ఖాన్ తో కలిసి చేస్తున్న సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ అవుతుంది. ఇదే కాకుండా మరో రెండు సినిమాలు చేస్తోంది తాప్సీ.