ప్రియుడి గురించి మొత్తం చెప్పేసిన తాప్సీ..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియుడి గురించి మొత్తం చెప్పేసిన తాప్సీ.. 

May 11, 2020

Taapsee Pannu says she won’t hide her relationship, reveals what her family thinks of her boyfriend

బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టాలెంటెడ్ నటి తాప్సీ పన్నూ విదేశీ యువకుడితో డేటింగ్ చేస్తోందన్న వార్తలు నిజమేనని తేలాయి. ఆమే స్వయంగా బయటపెట్టిది. ‘యస్.. నేనేమీ దాచిపెట్టడం లేదు. అతనితో ఉన్నాను. మా ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలుసు. వాళ్లు ఒప్పుకోకపోతే కథ ఇంతవరకు వచ్చేంది కాదు. నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. అదే సమయంలో నాదైన జీవితం ఉంది. మేమిద్దరం ఇష్టపడ్డాం. ఎప్పుడే  నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు.. ’ అని వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ముంబై నుంచి డిల్లీలోని తన తల్లితో ముచ్చటిస్తూ మీడియాతోనూ కబుర్లు పెట్టింది. 

‘మావాళ్లకు నువ్వు నచ్చకపోతో నీతో కటీఫ్ అని అతనికి చెప్పాను. మొత్తానికి మా ఫ్యామిలీకి అతడు నచ్చాడు. అందుకే ఈ విషయాన్ని బయటపెడుతున్నాను.. ’ అని వివరించింది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆడగాడు మితియాస్ బోతో తాప్సీ పీకల్లో ప్రేమలో ఉంది.  బో తాస్పీ సోదరి షగున్ ద్వారా బో ఆమెకు పరిచయమయ్యాడు. తెలుగులో కాస్త అరకొర విజయాలు సాధించి బాలీవుడ్ లోకి వెళ్లి తాప్సీ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తోంది.