కరెంట్ బిల్లు చూసి తాప్సీ షాక్.. వారంలో ఒక్కరోజే వెళ్లే ఇంటికి.. - MicTv.in - Telugu News
mictv telugu

కరెంట్ బిల్లు చూసి తాప్సీ షాక్.. వారంలో ఒక్కరోజే వెళ్లే ఇంటికి..

June 28, 2020

gngvbn

కరోనా సంక్షోభంలో కరెంట్ బిల్లులు కలవర పెడుతున్నాయి. వందలలో వచ్చేవారికి వేలల్లో, వేలల్లో వచ్చేవారికి లక్షల్లో బిల్లులు మోత మోగిస్తున్నాయి. చిన్న చిన్న గుడిసెలకు సైతం ఊహించని రీతిలో కరెంట్ బిల్లులు షాక్ ఇస్తున్నాయి. దీంతో ప్రజల నుంచి తీవ్ర విముఖత ఎదురవుతోంది. అయితే ఈ కరెంట్ బిల్లుల మోత సామాన్యులకే కాదు ఇప్పుడు సెలబ్రిటీలకు కూడా తప్పడంలేదు. ఇటీవల హీరోయిన్‌ కార్తీక నాయర్ ఇంటికి లక్ష రూపాయల కరెంట్‌ బిల్లు రాగా, తాజాగా మరో హీరోయిన్‌ తాప్సీ ఇంటికి రూ.36,000 కరెంట్ బిల్లు వచ్చింది. సాధారణ రోజుల్లో వచ్చే బిల్లు కంటే ఈ నెలలో (జూన్‌) దాదాపు 10 రెట్లు బిల్లు ఎక్కువ రావడంతో తాప్సీ షాక్‌కు గురైంది. దీంతో ట్విటర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. 

వారానికో రోజు వెళ్లి వచ్చే ఇంటికి పెద్దమొత్తం కరెంట్‌ బిల్లు రావడం ఏంటని? ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది. ‘ఇది మా అపార్ట్‌మెంట్‌ బిల్లు. వారంలో ఒక్కరోజు మాత్రమే క్లీనింగ్‌ కోసమని  ఈ ఆపార్ట్‌మెంట్‌కు వెళ్తుంటాం. మామూలు రోజుల్లో ఎవరూ ఉండరు. ఈ బిల్లు చూస్తుంటే  మాకు తెలియకుండానే ఎవరో ఈ ఆపార్ట్‌మెంట్‌ను వినియోగిస్తున్నారనే భయం కలుగుతోంది. నిజాన్ని వెలికి తీసేందుకు నాకు సహాయం చేయండి’ అంటూ అదాని ఎలక్ట్రిసిటీ ముంబై అధికారిక ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్ చేసింది. చూడాలి మరి తాప్సీ ఆవేదనను అధికారులు అర్థం చేసుకుంటారో లేదో.