మందుల పేర్లు ఇక తెలుగులోనూ - MicTv.in - Telugu News
mictv telugu

మందుల పేర్లు ఇక తెలుగులోనూ

July 14, 2020

Tablets names in telugu

మందు డబ్బాలపై పేర్లు ఇంగ్లీష్ లో ఉంటాయి. దీంతో ఎక్కువగా చదువుకొని వాళ్లకు ఇంగ్లీష్ రాని వాళ్లకు ఆ పేర్లను అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. దీంతో చదువుకున్న వాళ్ళ సహాయం పొందుతుంటారు. కానీ, అలా ఎన్ని రోజులు చేస్తారు. ఇబ్బంది ఎప్పటికైనా ఇబ్బందే. దానికి సరైన పరిష్కారం చూపాల్సిందే. ఈ నేపథ్యంలో సామాన్యులకు మందులపై అవగాహన పెంచేందుకై తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బస్తీ దవాఖానల్లో రోగులకు ఇచ్చే మందులపై తెలుగులో కూడా ముద్రించి అందజేయడం మొదలుపెట్టింది. సామాన్యులకు కూడా మందుల పేర్లు తెలిసేలా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వైద్యాధికారులు తెలిపారు. మలక్‌పేట క్లస్టర్‌ పరిధిలోని బీ-బ్లాక్‌, శాలివాహననగర్‌, గడ్డిఅన్నారం, మాదన్నపేట, జాంబాంగ్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇలాగే మందులను సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మందులు బ్లాక్‌ మార్కెట్‌కు వెళ్లకుండా చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.