Tabu gets injured on the sets of 'Bholaa' in Hyderabad
mictv telugu

హైదరాబాద్‌లో ఫైట్ సీన్ షూటింగ్‌.. హీరోయిన్ టబుకు గాయాలు

August 11, 2022

సీనియర్ హీరోయిన్ టబు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భోలా’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇందులో టబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో జరుగుతుంది. బుధవారం సినిమా షూటింగ్‌లో ఆమె ఒక ఫైట్ సీన్ కోసం స్టంట్ చేస్తూ ఉండగా గాయపడింది.

షూటింగ్ సమయంలో ట్రక్కును బైక్స్‌తో ఛేజ్ చేసే సీన్ షూట్ చేస్తున్న టైమ్‌లో ప్రమాదం జరగడంతో టబుకు గాయాలు అయినట్లు తెలిసింది. ట్రక్కు అద్దాలు పగిలి.. ట్రక్కు లోపల టబుకు గుచ్చుకుంది. దీంతో ఆమె కుడి కన్నుపై గాయమైనట్లు సమాచారం. టబు కుడి కన్ను పైన ఆ గాజు ముక్క కోసుకుపోయిందని తెలిసింది. అదే కంటికి తగిలి ఉంటే అది పెనుప్రమాదం అయి ఉండేదని అంటున్నారు.

దీంతో వెంటనే ఆమెకు సెట్స్‌లో ఉన్న డాక్టర్‌తో ట్రీట్మెంట్ చేయించారు. అయితే ఆ గాయానికి ఎలాంటి కుట్లు అవసరం లేదని వైద్యులు చెప్పారు. అయితే ఆమె తనంతట తానుగా కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోవడానికి అజయ్ ఒక ఆమెకు బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ‘భోలా’ కంటే ముందు, నటి టబు ‘దృశ్యం’ సినిమాలో ఒక ఒక పోలీసు అధికారి పాత్రలో కనిపించింది. తెలుగు సహా దక్షిణాది భాషల్లో సత్తా చాటిన టబు ఈ మధ్య బాలీవుడ్ సినిమాల్లో కూడా తన మార్క్ చూపుతోంది.