బాపురే రూ. 2.3కోట్ల ఫోన్..! - Telugu News - Mic tv
mictv telugu

బాపురే రూ. 2.3కోట్ల ఫోన్..!

May 24, 2017

ఫోన్ ధర ఉంటే గింటే 70,80 వేలు…మహా అంటే లక్ష రూపాయలు..అదీ యాపిల్ ఫోనైతే రూ. 50వేలకు తక్కువైతే ఉండదు. ఇక సామ్‌సంగ్‌ నుంచి గెలాక్సీ సిరీస్‌లో కొన్ని ఫోన్లు కూడా రూ. 40 నుంచి రూ. 60వేల వరకు ఉంటున్నాయి. అంతకంటే ఖరీదైన ఫోన్లు కొన్ని మార్కెట్లలో ఉన్నాయి. లగ్జరీ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ వర్చూ నుంచి రిలీజైన ఫోన్ల ధరలు రూ. లక్షల్లో ఉంటాయి. అయితే తాజాగా ఈ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్‌ను విడుదల చేసింది. దాని ధర అక్షరాల రూ. 2.3కోట్లు.
బ్రిటన్‌కు చెందిన ఈ సంస్థ వర్చూ సిగ్నేచర్‌ కోబ్రా ఫీచర్‌ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. పరిమిత ఎడిషన్‌గా మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ ధర 3.6లక్షల డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 2.3కోట్లకు పైనే. ఇంత ధర ఉందంటే.. ఈ ఫోన్లో ఏమైనా వజ్రాలేం లేవు.ఈ ఫోన్‌ తయారీలో 439 కెంపులను ఉపయోగించారట. పేరుకు తగ్గట్టుగా ఫోన్‌ చుట్టూ పాము బొమ్మను తీర్చిదిద్దారు. పాము కళ్లను పచ్చలతో పొదిగారు.
ఈ ఫోన్‌ను యూకేలో తయారుచేశారు. ఇప్పటివరకు కేవలం 8 ఫోన్లను మాత్రమే సంస్థ రూపొందించిందట.
ఫోన్‌ ఫీచర్లు :
* 2 అంగుళాల డిస్‌ప్లే
* 2 జీబీ రామ్‌
* 16జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌