Home > ట్విట్టర్ కు గుడ్ బై..!

ట్విట్టర్ కు గుడ్ బై..!

ముస్లింల అజాన్‌పై వివాదాస్ప‌ద ట్వీట్లు చేసి దుమారం రేపిన బాలీవుడ్ సింగ‌ర్ సోనూ నిగ‌మ్.. తాజాగా ట్విట్ట‌ర్‌కు గుడ్‌బై చెప్పాడు. భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు గౌర‌వం లేని చోట తాను ఉండ‌ద‌ల‌చుకోలేద‌ని అత‌ను స్ప‌ష్టంచేశాడు. ఏక‌ధాటిగా 24 ట్వీట్లు చేశాడు సోనూ నిగ‌మ్‌. వాటిని స్క్రీన్‌షాట్స్ తీసుకోవాల‌ని, కాసేప‌ట్లో త‌న అకౌంట్ ఉండ‌బోద‌ని ముందే మీడియాకు కూడా స్పష్టం చేశాడు. సాటి సింగ‌ర్ అభిజీత్ భ‌ట్టాచార్య అకౌంట్‌ను ట్విట్ట‌ర్ తొల‌గించ‌డాన్ని సోనూ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టాడు. జేఎన్‌యూ విద్యార్థిని ప‌ట్ల అస‌భ్య‌క‌ర ట్వీట్లు చేశాడ‌న్న కార‌ణంతో అభిజీత్ అకౌంట్‌ను ట్విట్ట‌ర్ స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో ట్విట్ట‌ర్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించింద‌ని సోనూ ఆరోపించాడు.

Updated : 24 May 2017 3:41 AM GMT
Next Story
Share it
Top