ఎమ్మార్వో వనజాక్షిపై తిరగబడ్డ రైతులు - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మార్వో వనజాక్షిపై తిరగబడ్డ రైతులు

February 17, 2020

vanajakshi.

తహసీల్దార్ వనజాక్షి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లి వేమవరంలో ఇళ్ల పట్టాల కోసం భూమిని సేకరించేందుకు ఏర్పాటు చేసిన సభలో వనజాక్షిపై రైతులు తిరగబడ్డారు. సభ జరుగుతున్న సమయంలో ఎమ్మార్వో వనజాక్షి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బయటకు వెళ్లాలన్నారు. 

దీంతో రైతులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్ని బ్రోకర్లు అనడం ఏంటని ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఎమ్మార్వో క్షమాపణలు చెప్పాలని రైతులు, మహిళలు ఆమెను అడ్డుకున్నారు. వనజాక్షి సభ జరుగుతున్న ప్రాంతం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఎమ్మార్వో బయటకు వస్తున్న సమయంలో ఆమెను మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వనజాక్షిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు. వనజాక్షిపై స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.