లంచమే తహశీల్దార్‌ విజయారెడ్డి ప్రాణం తీసిందా! - MicTv.in - Telugu News
mictv telugu

లంచమే తహశీల్దార్‌ విజయారెడ్డి ప్రాణం తీసిందా!

November 4, 2019

vijaya reddy...

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెపై పెట్రోల్ దాడికి భూవివాదమే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారనకు వచ్చారు. నిందితుడిని హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్ ముదిరాజ్‌గా గుర్తించారు. 

సురేష్ పొలం రిజిస్ట్రేషన్ విషయంలో తహశీల్దార్ విజయరెడ్డి తన ప్రత్యర్థులతో చేతులు కలిపారని, తనను వేధించారని, లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని, అందుకే ఆమెను సజీవదహనం చేశానని పోలీసుల విచారణలో రైతు సురేష్ అంగీకరించినట్టు సమాచారం. సురేష్ ప్రస్తుతం కొంపల్లిలోని సన్‌రైజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.

 

నిందుతుడు సురేష్