నాది గంటీల జోడీ.. క్వార్టర్ ఫైనల్స్‌లో దర్జీ పాట స్పెషల్ - MicTv.in - Telugu News
mictv telugu

నాది గంటీల జోడీ.. క్వార్టర్ ఫైనల్స్‌లో దర్జీ పాట స్పెషల్

January 19, 2020

Folk Studio.

‘నాటి ఆయుధాలు ఉన్నవి సాయుధ సంఘర్షణే.. చలో చలో ఉఠో ఉఠో..’ పాటతో ప్రజాగాయని విమలక్క ఫోక్ స్టూడియో పాటలపోటీని మరింత పరుగులు పెట్టించారు. మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జానపద పాటలపోటీ ఫోక్ స్టూడియోకు మీనుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్ రౌండ్స్ జరుగుతున్నాయి. ఒక్కక్కరు పాడుతుంటే ఊరు, శివారు, గుట్ట, పుట్ట, బర్రె, గొర్రె, బాలంగిరిండ్లు, అమ్మలు, తాతలు గుర్తుకు వస్తున్నారని తెలుపుతున్నారు. చాలా సంతోషం.. మీ కామెంట్లు మాకు బూస్టును ఇస్తున్నాయి. ప్రిలిమ్స్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చింది మా ప్రయాణం. అందరూ చక్కని పాటలు పాడుతున్నారు. 

మహబూబ్ నగర్ నుంచి వచ్చిన నర్సింలు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. ‘వస్తానని రాకపాయె వనపర్తి రాములమ్మ’ అంటూ ఊపున్న పాటతో వచ్చాడు. ఈ పాటతో నర్సింలు మిమ్మల్ని ఉర్రూతలూగించడం ఖాయం. ఇక రాయలసీమ కడప ముద్దుబిడ్డ స్వాతి కమ్మని  గాత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె గొంతులో పాట అమృతం అవుతుంది. ‘చింతమాను చిలుకలారా కొమరవీధి జానలారా.. సందమామ లాంటిదాన్నిరా నా సామిరంగా..’ అనే పాటతో వచ్చారు. మరో పాటగాడు సిరిసిల్ల నుంచి వచ్చిన బైరగోని చంద్రం ‘నీలా నీ మొగుడు నీలమ్మా ఎందవోయినాడే నీలా..’ పాటతో వచ్చాడు. అలాగే వరంగల్ నుంచి వచ్చిన చిరంజీవి ‘నాది గంటీల జోడీ.. నాది గంటీల జోడీ..’ అనే పాటను పట్టుకొచ్చి పాడుతున్నాడు. ఆయన దర్జీగా బట్టలు ఎంత చక్కగా కుడుతాడో పాట కూడా అంతే అల్లికగా పాడుతాడు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఎపిసోడ్ చూసెయ్యండి మరి.