స్వలింగ వివాహాలకి తైవాన్ గ్రీన్ సిగ్నల్ - MicTv.in - Telugu News
mictv telugu

స్వలింగ వివాహాలకి తైవాన్ గ్రీన్ సిగ్నల్

May 17, 2019

స్వలింగ సంపర్కుల వివాహానికి తైవాన్‌ అనుమతి ఇచ్చింది. రెండేళ్ల క్రితం అక్కడి సుప్రీం కోర్టు గే పెళ్లిళ్లకు సంబంధించి తగిన మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శుక్రవారం ఆ దేశ పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. బిల్లు ఆమోదం పొందడంతో ఆ దేశ రాజధాని తైపీలో వేలాది మంది స్వలింగ సంపర్కులు, ట్రాన్స్ జెండర్లు భారీ ప్రదర్శన చేశారు. ఆనందంతో నినాదాలు చేశారు. దీంతో స్వలింగ సంపర్కుల వివాహానికి అనుమతించిన మొదటి ఆసియా దేశంగా తైవాన్‌ నిలిచింది. ఇలాంటి వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దేశం డెన్మార్క్‌. తర్వాత నార్వే, స్వీడన్‌, ఐలాండ్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలు వున్నాయి.

అయితే వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలుండటంతో ఆ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ఈ బిల్ ఆమోదించినట్లు తెలుస్తోంది.  భారత్‌లోనూ ఇలాంటి డిమాండ్‌ వుంది. స్వలింగ సంపర్కానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ.. వివాహాలకు మాత్రం అనుమతి ఇవ్వరాదన్న నిర్ణయంతో కేంద్రం ఉంది.