Taiwanese company Evergreen announced four years of salary as a bonus for employees
mictv telugu

ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. బోనస్ గా 4 ఏళ్ల జీతం

January 9, 2023

Taiwanese company Evergreen announced four years of salary as a bonus for employees

సాధారణంగా బోనస్ అంటే ఒక నెలో లేదా రెండు నెలల జీతాన్ని అదనంగా చెల్లిస్తారు. కానీ తైవాన్ కి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ మాత్రం ఏకంగా 4 సంవత్సరాల జీతాన్ని బోనస్ గా ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఎవర్ గ్రీన్ అనే షిప్పింగ్ కంపెనీ ఈ ఆఫర్ ప్రకటించింది. అయితే ఉద్యోగి జాబ్ గ్రేడ్, తైవాన్ దేశ చట్టాలకు లోబడి కాంట్రాక్టు ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఒక ఏడాదిలో ఉద్యోగి పనితీరు ఆధారంగా సంవ్సతర బోనస్ లు ఉంటాయని కంపెనీ తెలిపింది. 2020 ని 2022తో పోలిస్తే సంస్థ ఆదాయం గణనీయంగా పెరిగి ఏకంగా 20.70 బిలియన్ డాలర్లకు చేరడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇంతటి పండుగ లాంటి ఆఫర్ ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వలేదని చెప్పవచ్చు. కాగా, గతేడాది ఈ సంస్థకు చెందిన ఓ నౌక ఈజిప్టులోని సూయిజ్ కాలువలో చిక్కుకుపోయింది. దీని వల్ల కొద్ది రోజుల పాటు ఇతర నౌకల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆ సందర్భంలోనే కంపెనీ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. తాజా చర్యతో మరోసారి కంపెనీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.