ట్రంప్ వస్తున్నాడని 300 ఏళ్ల తర్వాత కడిగేశాం..   - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్ వస్తున్నాడని 300 ఏళ్ల తర్వాత కడిగేశాం..  

February 24, 2020

taj mahal cleaned after 300 years 

మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పండగ రోజుల్లో కాస్త శుభ్రంగా, చూడ్డానికి చక్కగా ఉండాలనుకుంటాం. ఇళ్లయినా, ఒళ్లయినా మరేదైనా సరే కళకళలాడిపోవాల్సిందే. అలాంటిది ఏకంగా అగ్రరాజ్య అధినేత వస్తున్నాడంటే! ఎంత హంగామా చెయ్యాలో అంతా చేసేస్తున్నాం. ఈ రోజు ట్రంప్ దంపతులు, ఆయన కుమార్తె ఇవాంకా దంపతులు ప్రేమమందిరం తాజ్ మహల్‌ను సందర్శించి అచ్చెరువొందారు. పాలరాతి అద్భుతానికి ఫిదా అయిపోయారు. 

ట్రంప్ రాక పుణ్యమా అని మరో మంచి కూడా జరిగింది ఆ కట్టడానికి. దాదాపు 300 ఏళ్ల తర్వాత తాజ్‌లోని రెండు సమాధులను తళతళా తోమేశారు. క్లేప్యాక్ వేసి, చింతపండు నీళ్లతో రుద్ది రుద్ది కడిగారు. తాజ్‌మహల్ లోపల ముంతాజ్, షాజహాన్ సమాధులు ఉంటాయి. అయితే మనకు కనిపించేవి కింది భాగంలో  ఉన్న సమాధులపై నిర్మించిన నమూనా సమాధులు మాత్రమే. అసలు సమాధులను చూడ్డానికి ఏటా మూడు రోజులు మాత్రమే అనుమతిస్తారు. ట్రంప్ వస్తున్నాడని నమూనా గోరీలను జాగ్రత్తగా శుభ్రం చేశారు. వాటిని క్లేప్యాక్ విధానంలో శుభ్రపరిచారు. ముందు ముఖాలకు పూసినట్లు.. మెత్తని మట్టితో ప్యాక్ వేసి, తర్వాత డిస్టిల్‌ వాటర్‌తో కడిగారు. శ్వేతశిలా మందిరాన్ని నిజానికి క్లేప్యాక్ విధానంలో ఇప్పటికి ఐదుసార్లు కడిగారు. అయితే నమూనా సమాధులను మాత్రం వదిలేశారు. ట్రంప్ వస్తున్నాడు కనుక చూడ్డానికి బాగుండదని చక్కగా మెరిపించారు. తాజ్ వద్ద కోతుల బెడదను అరికట్టడానికి ఇప్పటికే ఐదు కొండముచ్చులను రంగంలోకి దించడం తెలిసిందే.

 

taj mahal cleaned after 300 years