తాజ్మహల్ ఈ దేశానిదే.. తేల్చిచెప్పిన మొగల్ వారసుడు - MicTv.in - Telugu News
mictv telugu

తాజ్మహల్ ఈ దేశానిదే.. తేల్చిచెప్పిన మొగల్ వారసుడు

April 16, 2018

తాజ్ మహల్ తమకు చెందుతుందని ఇటీవల యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు చెప్పడం, దాన్ని మీకు రాసిచ్చినట్లు షాజహాన్ చేసిన సంతకం ఉందా అని సుప్రీం కోర్టు మొట్టికాయ వేయడం తెలిసిందే. ఈ వివాదంపై మొగల్ చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్ వారసుడు స్పందించారు.

‘తాజ్ మహల్ భారత దేశానికే చెందుతుంది. అది ఈ దేశపు ఆస్తి. ఏ వ్యక్తికీ దానిపై హక్కులేదు..’ అని జాఫర్ ముని మునిమనవడు వైహెచ్ టూసీ స్పష్టం చేశారు. తాజ్ మహల్‌పైనే కాకుండా అయోధ్యలోని బాబ్రీ మసీదుపైనా వక్ఫ్ బోర్డుకు ఎలాంటి హక్కూ లేదన్నారు.

 

‘షాజహాన్.. తాజ్‌ను వక్ఫ్ బోర్డుకు రాసివ్వలేదు. అయోధ్యలో రామమందిరాన్ని ఇంకా ఎందుకు నిర్మించలేదో నాకర్థం కావడం లేదు. మతసామరస్యాన్ని సాధించే ఏ చర్యకైనా నేను మద్దతిస్తాను. వక్ఫ్ బోర్డు పెద్ద భూకబ్జాదారు. వారికి వాళ్ల ఆఫీసులో కుర్చీలే లేవు. అలాంటి వారు తాజ్‌ను ఎలా సంరక్షిస్తారు? కేవలం  మీడియాను ఆకర్షించేందుకు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇలా మాట్లాడుతున్నారు. మా పూర్వీలకు ఆస్తులన్నీ నేను సంరక్షకుడిగా నియమితుణ్నయ్యాక భారత ప్రభుత్వానికి అప్పగిస్తా. దీనికి సంబంధించి సుప్రీం కోరర్టులో కేసు నడుస్తోంది.. ’ అని టూసీ చెప్పారు.