Taj Mahal or Tejo Mahalaya: Allahabad HC rejects plea to open 22 closed doors
mictv telugu

వెళ్లి పీహెచ్‌డీలు చేస్కోండి… తాజ్‌మహల్ గదులు తెరవడానికి కోర్టు నో

May 12, 2022

Taj Mahal or Tejo Mahalaya: Allahabad HC rejects plea to open 22 closed doors

దేశంలో కొన్ని రోజులుగా తాజ్‌మహల్ గురించి చర్చ జరుగుతోంది. అది తేజో మహాలయ అని.. తాజ్ మహల్‌లో ఉన్న 22 గదుల్లో హిందూ విగ్రహాలున్నాయని కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజ్ మహల్‌ గదులను తెరిపించాలని అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలయింది. హైకోర్టులో పిల్ దాఖలవడంతో దేశవ్యాప్తంతా తాజ్ మహల్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఐతే గురువారం అలహాబాద్ హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈ వ్యవహారాన్ని చరిత్రకారులకు వదిలేయండంటూ తేల్చి చెప్పింది.‘‘వెళ్లండి. వెళ్లి ఏదైనా పరిశోధనలు చేసుకోండి. ఎంఏలు, పీహెచ్‌డీలు చేసుకోండి. కోర్టు సమయాన్ని వృథా చేయకండి’’ అంటూ చీవాట్లు పెట్టింది. ఇద్దరు న్యాయమూర్తులు ఉపాధ్యాయ్‌, సుభాష్‌ విద్యార్థిలుగా ఉన్న బెంచ్ పిటిషనర్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి వ్యవహారాన్ని సరదాగా నాలుగు గోడల మధ్య కూర్చుని చర్చిస్తే బాగుంటుంది. ఇలా కోర్టు రూమ్‌లో కాదు అంటూ బెంచ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారం కాదని, కోర్టు బయట మెథడాలజీ, చరిత్రకారుల ద్వారా తేలాల్సిన విషయం అని బెంచ్‌ స్పష్టం చేసింది. ఒకవేళ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఆర్టీఐ ద్వారా తెలుసుకోవాలంటూ సూచించింది.