లాక్డౌన్ సడలింపులతో ఒక్కొరంగం మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. ఇటీవల వచ్చిన మార్గదర్శకాలలో చారిత్రక కట్టాలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. అవకాశాన్ని బట్టి తెరుచుకునే వీలును రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. ఈ నేపథ్యంలో తాజ్ మహల్ సందర్శనకు అనుమతి ఇవ్వాలని ఇటీవల నిర్ణయించారు. జులై 6 నుంచి దేశీయ పర్యాటకులకు అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్టు పర్యాటన శాఖ అధికారులు వెల్లడించారు.
స్మాకర కట్టడాలు జూలై 6న తిరిగి తెరుచుకోనున్నాయని ఇటీవల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింఘ్ పటేల్ ప్రకటించారు. అయితే ఆగ్రాలో కరోనా కేసులు అధికంగా ఉండటం, వల్ల తాజ్మహల్ తెరిచేది లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. నగరంలోని తాజ్మహల్, ఆగ్రా కోట, అక్బర్ సమాధి అన్ని మూసే ఉంచుతామని తెలిపారు. పర్యాటకలు వస్తే వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఇప్పట్లో తాజ్మహల్ తెరుచుకునే అవకాశం లేకుండా పోయింది. కాగా ఇప్పటికే ఆగ్రాలో 71 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.