బ్లూవేల్ నుంచి ఇలా రక్షించుకోండి.. - MicTv.in - Telugu News
mictv telugu

బ్లూవేల్ నుంచి ఇలా రక్షించుకోండి..

September 7, 2017

వీడియోగేమ్ లు వ్యసనాలు. బ్లూవేల్ ఆన్  లైన్ గేమ్ ప్రాణాంతక గేమ్. దీనిబారిన పడి చాలా మంది ఇప్పటికే ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరెందరో గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరారు. ఈ ప్రమాదరకర గేమ్ నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడుకోవాలి. ఆత్మహత్యల బారిన పడకుండ రక్షించుకోవాలి అదెలాగంటే..

మీ ఇంట్లో 11 – 19 మధ్య వయస్సుగల పిల్లలు  ఉంటే  ఫేస్ బుక్, వాట్సాప్ లలో ఈ బ్లూ వేల్ ఆటకు సంబంధించిన లింకు ను తెరవకుండా చూడండి.

పిల్లలు స్కూళ్లకు సరిగ్గా వెళ్తున్నారో లేదో గమనించండి. అనుమానం వస్తే స్కూలును సంప్రదించండి.  పిల్లలు శ్రద్ధగా చదువుతున్నారో లేదో గమనించండి.

పిల్లలను సాధ్యమైనంతవరకు ఒంటరిగా ఉంచకండి. వాళ్లతో వీలైనంత ఎక్కువ సమయం గడపండి. వారికి చదువుపై విసుగేసినప్పుడు మంచిమంచి కథల పుస్తకాలు అందించండి. వాళ్లు వేళకు నిద్రపోతున్నారో లేదో గమనిస్తూ ఉండండి.

బ్లూవేల్ ప్రస్తావన వస్తే.. దాని గురించి దాటేయకుండా.. దానివల్ల తలెత్తే సమస్యల గురించి వివరించండి. అదొక సైకో గేమ్ అని, దానికి దూరంగా ఉండాలని నచ్చజెప్పండి.

పిల్లలను వీలైతే వారాంతాల్లో పార్కులకు, జూలకు, మ్యూజియాలకు.. ఇతర వినోద స్థలాలకు తీసుకెళ్లండి. ఇంటర్నెట్, గేమ్ లు జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమేనని, అవే జీవితం కాదని చెబుతూ ఉండండి.

మీ పిల్లలకు సాధ్యమైనంతవరకు సెల్ ఫోన్ ఇవ్వకండి. మీ సెల్ ఫోన్లను కూడా వారి ఇవ్వకండి. ఒకవేళ ఫోన్ చేసుకోవాలంటే.. ఫోన్ చేసే సమయంలో మీరు పక్కనే ఉండండి.

బ్లూవేల్ ఆట ఇదీ..

బ్లూవేల్ ఆన్ లైన్ గేమ్. దీన్ని ఆడేవారికి టాస్క్ లు ఇస్తారు. వాటిని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. టాస్క్ ల స్థాయి పోయేకొద్దీ పెరుగుతూ ఉంటుంది.

బ్లూవేల్లో ఇచ్చే టాస్కులు..

1  బ్లేడ్ తో మీ చేతిమీద f57 అని చెక్కి దానిని ఫోటో తీసి క్యూరేటర్ కు పంపడం.

2  ఉదయం 4.20కి  నిద్రలేచి క్యూరేటర్ పంపే భయానక వీడియోలు చూడటం.

3  మీ చేతిమీద, నరాలను ఎక్కువగా కాకుండా  బ్లేడ్ తో 3 గాట్లు పెట్టి ఆ ఫోటోను క్యూరేటర్ కి పంపడం.

4  కాగితం మీద వేల్ (తిమింగలం) బొమ్మ వేసి ఫోటో తీసి క్యూరేటర్ కు పంపడం.

5  మీరు ” WHALE గా మారడానికి ” రెడీగా ఉంటే కాలి మీద YES అని బ్లేడ్ తో రాయడం.

లేదంటే చాలా సార్లు బ్లేడ్ తో గీసుసుకోవడం

6  CIPHER అనే దానితో పోటీ పడడం.

7  బ్లేడ్ తో మీ చేతిమీద F40 అని గీసుకొని అది ఫోటో తీసి క్యూరేటర్ పంపడం

8   #I _ AM _ WHALE ” అని మీ VKONTAKTE స్టేటస్ LO టైపు చెయ్యండి.

9  మీ భయం నుండి బయటకు రావడం

10  ఉదయం 4.20కి లేచి గేమ్ ఆడటం. మీ ఇంటి పైకి వెళ్లి, యెంత ఎత్తులో ఉండటం సాధ్యమైతే అంత ఎత్తులో ఉండటం.

11  మీ చేతిమీద బ్లేడ్ WHALE (తిమింగలం) బొమ్మ గీసుకుని ఫోటో క్యూరేటర్ కు పంపడం.

12  ఆ రోజంతా మీ మనసుకు నచ్చిన, భయానక వీడియోలు చూడటం.

13  క్యూరేటర్ పంపిన సంగీతం విడటం.

14  మీ పెదవిని కోసుకోవడం

15  చేతిపై సూదితో అనేకసార్లు పొడుచుకోవడం

16  మీకు బాధ అనిపించే పనిచేసి SICK అయిపోవడం

17  మీకు తెలిసిన ఎత్తైన మేడమీది ROOF మీదకు వెళ్లి దాని అంచు చివర చాలాసేపు నిలబడటం

18  ఒక BRIDGE వద్దకు వెళ్లి దాని అంచున నిలబడడం

19  ఒక CRANE మీదకు ఎక్కడం, లేదకపోతే ఎక్కడానికి ప్రయతించడం.

20  మీ క్యూరేటర్ మీరు నమ్మకస్తులా కాదా అని పరీక్షించడం

21  SKYPE లో వేరొక ఆటగానితో లేదా క్యూరేటర్ తో “TALK WITH ఆ WHALE ” లా మాట్లాడటం.

22  ROOF పైకే ఎక్కి అంచున కాళ్లూపుతూ కూర్చవడం

23  CIPER తో మరొక పోటీ.

24  రహస్యంగా సంభాషించడం

25  ” WHALE ” తో మీటింగ్ కు వెళ్లడం

26  క్యూరేటర్ మీరు మరణించే తేదీని సూచిస్తారు. మీరు తప్పక దానిని ఒప్పుకోవాలి.

27  పొద్దునే లేచి లేచి రైలు పట్టాల దగ్గరకు వెళ్లడం.

28  ఆ రోజు ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఉండడం

29  మీరు ” నేను WHALE ని” ప్రతిజ్ఞ తీసుకోవడం

30-49   ప్రతిరోజూ 4.20కి నిద్రలేచి క్యూరేటర్ పంపే భయానక వీడియోలు చూస్తూ, సంగీతం వింటూ బ్లేడ్ తో BODY మీద గాట్లు పెట్టుకుంటూ WHALE తో మాట్లాడడం,.

50  ఎత్తైన ప్రదేశం నుండి దూకి చనిపోవడం