వైరల్ : గవర్నర్ తమిళిసైకి శాలువా కప్పి నమస్కరించిన తలసాని - MicTv.in - Telugu News
mictv telugu

వైరల్ : గవర్నర్ తమిళిసైకి శాలువా కప్పి నమస్కరించిన తలసాని

April 21, 2022

9

నిన్నటివరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు గురువారం జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒకరికొకరు తారసపడ్డారు. సికింద్రాబాద్ పరిధిలోని పద్మారావు నగర్‌లో స్కందగిరి దేవాలయంలో విగ్రహ పున:ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర సరస్వతి స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ బంధన మహా కుంభాభిషేకం పూజలు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయానికి ముఖ్య అతిథులుగా గవర్నర్, మంత్రి వచ్చారు. ఈ క్రమంలో గవర్నర్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాలువా కప్పి నమస్కారం పెట్టారు. గవర్నర్ కూడా నవ్వుతూ ప్రతి నమస్కారం చేశారు. కాగా, గవర్నర్ ప్రోటోకాల్ విషయంలో గవర్నర్, ప్రభుత్వం మధ్య వివాదం రేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తలసాని బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ అనేది నామినేటెడ్ పదవి అనీ, ఆ వ్యవస్థ వల్ల పెద్ద ఉపయోగం లేదని ఘాటుగా విమర్శించారు.