గవర్నర్‌పై తలసాని ఘాటు వ్యాఖ్యలు.. గిల్లికజ్జాలు వద్దు - MicTv.in - Telugu News
mictv telugu

గవర్నర్‌పై తలసాని ఘాటు వ్యాఖ్యలు.. గిల్లికజ్జాలు వద్దు

April 20, 2022

12

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైపై తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు తమను ఎన్నుకున్నారని, తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని గవర్నర్‌పై మండిపడ్డారు. బుధవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ..”ప్రెస్‌మీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నన్ను ఎన్నుకున్నారు. మేమంతా నామినేటెడ్ వ్యక్తులం కాదు.

ముఖ్యమంత్రితో పనిచేయడం ఇష్టం లేదని చెప్పడం గవర్నర్ విజ్ఞతకే వదిలేస్తున్నాం. గవర్నర్‌గా ఆమె బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. రాజ్యాంగ పరంగా కొన్ని పరిమితులు ఉంటాయి. వాటికి లోబడే పని చేయాలి. కానీ, గవర్నర్ మీడియాతో అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. గవర్నర్ తన బాధ్యతను వదిలి పెట్టి రాజకీయపార్టీ నాయకురాలిగా మాట్లాడటం బాధాకరం. మహిళగా ఆమెను ఎంత గౌరవించాలో అంత గౌరవించాం. కానీ, అనవసర గిల్లికజ్జాలు పెట్టుకోవడం సరికాదు” అని తలసాని వ్యాఖ్యానించారు.