ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇప్పటికే కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. మొదటగా బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, మాజీ మంత్రి పేర్ని నానితోపాటు పలువురు కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోపక్క ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు స్పందిస్తూ, రీ కౌంటర్స్ ఇచ్చారు. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా స్పందించారు.
”కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ నేతలు, మంత్రులకు ఎందుకంత ఉలికిపాటు. హైదరాబాద్లో కరెంట్ లేకుంటే ఇక్కడెందుకు శుభకార్యాలు చేస్తున్నారు? కరోనా చికిత్స ఎవరు, ఎక్కడ తీసుకున్నారో అందరికీ తెలుసు. ఏపీ నేతలు ఎందుకు తొందరపడుతున్నారో అసలు అర్ధం కావట్లేదు. హైదరాబాద్లో జరగుతున్న అభివృద్ధినే కేటీఆర్ చెప్పారు” అని తలసాని అన్నారు.