తాలిబన్ల ఆరాచకం.. మగతోడు లేదని.. - MicTv.in - Telugu News
mictv telugu

తాలిబన్ల ఆరాచకం.. మగతోడు లేదని..

March 28, 2022

hj

అఫ్ఘ‌నిస్తాన్ దేశంలో తాలిబన్ల ఆరాచ‌కాలు రోజురోజుకు దారుణంగా తయారు అవుతున్నాయి. ఇటీవ‌లే ఆడ పిల్ల‌ల‌ను హైస్కూలు చ‌దువుకు అనుమ‌తిస్తామ‌ని చెప్పి, ఆ హామీని తుంగ‌లో తొక్కుతూ, ఆడ పిల్లలు ఉన్నత చదువులు చదుకోవడానికి అనుమతులు లేవని తేల్చి చేప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్ర‌యాణ స‌మ‌యంలో ఓ విదేశీ మ‌హిళ‌ల‌కు మగతోడు లేకపోవడంతో, ఆ మహిళలను విమానం ఎక్కించని ఘటన శుక్రవారం కలకలం సృష్టించింది. అంతేకాకుండా తమ ప్రభుత్వంలో మహిళలకు మగతోడు త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని రూల్ పెట్టింది. దీంతో ఆ విదేశీ మ‌హిళ‌లు తీవ్ర ఇబ్బంది ప‌డ్డారు. తాలిబన్ల పెట్టిన రూల్‌ వల్ల చాలా మంది ప్రయాణం నిలిచిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్ఘనిస్తాన్‌లో ప‌దుల సంఖ్య‌లో మ‌హిళ‌లు ఇత‌ర దేశాల‌కు వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. దీనికోసం ముందే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో విదేశీ మ‌హిళ‌లు కూడా ఉన్నారు. అయితే, విమానంలోకి వెళ్లే ముందు అక్క‌డి అధికారులు చెప్పిన రూల్‌కు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మ‌గ తోడు లేకుండా విమానంలో ప్ర‌యాణించ‌డం కుద‌ర‌ద‌ని ఓ ఇద్దరు ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఆ మహిళలు ఏం చేయాలో తెలియక తికమకపడ్డారు.

మరోపక్క తాలిబ‌న్ల పాల‌న‌లో అక్కడి మ‌హిళ‌ల‌కు హ‌క్కులు పూర్తిగా త‌గ్గిపోతున్నాయి. వారికి స్వేచ్ఛ కూడా ఉండ‌టం లేదు. అక్కడి మ‌హిళ‌ల చ‌దువుల‌ విష‌యంలో అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంది. తాజాగా మహిళలకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని తాలిబన్లు వెంటనే కల్పించాలని, విద్యా హక్కును గౌరవించి స్కూళ్లను తెరవాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ) కోరింది.