కరుడుగట్టిన తాలిబన్లు అనగానే మనకు గుర్తుకు వచ్చేది మత ఛాందసవాదమే. అమ్మాయిలు చదువుకోవద్దు.. అబ్బాయిలు గడ్డం గీసుకోవద్దు అంటూ వారు పెట్టే కఠిన నిబంధనలు మధ్య యుగాలను తలపిస్తుంది. వీరి అరాచకాలను తట్టుకోలేక చాలా మంది దేశం వదిలి వెళ్లిపోయారు. చేతిలో భయంకరమైన మారణాయుధాలతో రాక్షసులుగా కనిపించే రూపమే అందరి కళ్ల ముందు మెదలుతుంది. కానీ వారిలో కూడా రానురాను మార్పు వస్తోంది. గత విడత పాలన కంటే ఈ విడత కొంత మెరుగ్గా ఉన్నట్టు కనిపిస్తోంది.
Video of Taliban unveiling their first ‘indigenously built’ supercar, the Mada 9. A team of 30 engineers worked on manufacturing Mada 9 for five years
Kya ho raha hai 2023 me pic.twitter.com/dK59fWN4Iu
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 13, 2023
మతం ఊడలుపట్టుకుని వేలాడుతున్నా ఆధునికతకు తాము వ్యతిరేకం కాదని నిరూపించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో తొలిసారి దేశీయంగా తయారు చేసిన సూపర్ కారును ప్రదర్శించారు. మడా 9 అనే పేరు పెట్టిన ఈ అత్యాధునిక కారు.. బుగాటీ, లంబోర్గినీ, ఫెరారీ వంటి మోడళ్లకు పోటీ వచ్చేలా ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. కాబూల్ లోని టెక్నికల్ వొకేషనల్ ఇన్ స్టిట్యూట్ కి చెందిన 30 మంది ఇంజీర్లు ఐదేళ్లు కష్టపడి దీన్ని తయారు చేశారు.
టొయోటా కొరొల్లా ఇంజిన్ వాడిన ఈ మడా 9 మోడల్ ని బుధవారం ఎన్ టాప్ ప్రధాన కార్యాలయంలో ప్రదర్శిచారు. అయితే దీని ఫీచర్లు, ఎప్పుడు విడుదల చేస్తారు వంటి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ముందుగా దేశంలో రిలీజ్ చేసి ఆ తర్వాత డిమాండును బట్టి ఎగుమతి అంశాన్ని పరిశీలిస్తారంట. ఈ కారు తమ దేశానికి గర్వకారణమంటూ తాలిబన్ల అధికార ప్రతినిధి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తమ ప్రజలకు మతంతో పాటు ఆధునిక విజ్ఞానాన్ని సైతం అందించడానికి తాలిబన్ల పరిపాలన కట్టుబడి ఉందని నిరూపించడానికి ఈ కారే నిదర్శనమని ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బఖీ హఖ్ఖానీ వెల్లడించారు. ఈ కారు ఆఫ్ఘనిస్తాన్ ఇమేజ్ పెంచడానికి దోహదపడుతుందని ఉత్పత్తి చేసిన సంస్థ ఎన్ టాప్ సీఈవో మహ్మద్ రిజా అహ్మదీ తెలిపారు.