Taliban warned Pakistan
mictv telugu

పాకిస్తాన్‌ని ఆక్రమించిన తాలిబన్లు.. పరిపాలన కూడా మొదలైంది

January 3, 2023

తాను పెంచి పోషించిన పాము చేతిలో తానే బలైనట్టు తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. సోవియట్ సైన్యాన్ని తరిమికొట్టాలని తయారు చేసిన తాలిబన్లు తర్వాత అమెరికా, నాటోలతో కూడా ధీటుగా పోరాడడంతో గర్వంగా మీసం మెలేసిన పాక్.. 2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడ్డాక తన ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్‌ని కాబూల్ పంపి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గదర్శకాలు కూడా ఇప్పించింది. కానీ 18 నెలలు గడిచాయో లేదో పరిస్థితులు దారుణంగా తిరగబడ్డాయి. అధికారంలోకి రాగానే పాకిస్గాన్‌తో ఉన్న 2600 కిలోమీటర్ల డ్యూరాండ్ రేఖపై దృష్టి సారించారు. అక్కడ్నుంచి తరచూ దాడులు చేస్తూ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పష్తూన్ ప్రాంతం తమదేనని వాదిస్తున్నారు. పాక్ రేంజర్లపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. వీరికి పాక్‌లోని తెహ్రీక్ ఎ తాలిబన్ మద్ధతుగా నిలుస్తోంది. ఈ సంస్థ పాకిస్తాన్‌లోనే అనేక దాడులకు తెగబడి సైన్యానికి విపరీత నష్టం కలిగిస్తోంది. అమెరికా, నాటో దళాలు తాలిబన్లపై విరుచుకుపడ్డప్పుడు పాక్ తాలిబన్ పక్షం వహించకపోవడంతో తెహ్రీక్ ఎ తాలిబన్ కోపం పెంచుకుంది. ఈ నేపథ్యంలో రెండు పక్షాలు ముప్పేట దాడి చేస్తుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్‌కి తాజాగా భారీ షాక్ తగిలింది.

టీటీపీగా పిలవడమే తెహ్రీన్ ఎ తాలిబన్ పాకిస్తాన్‌లో సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పింది. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని రెండు భాగాలుగా విభజించిన టీటీపీ.. వాటిలో గిల్గిట్, బాల్టిస్తాన్, ఆఫ్ఘాన్ సరిహద్దులను కలిపి ఒక ప్రాంతంగా పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సరిహద్దు వరకు మరో ప్రాంతంగా ప్రకటించుకుంది. దీంతో పాటు కీలకమైన డేరా ఘాజీ ఖాన్ ప్రాంతాన్ని కూడా తమదేనని వాదిస్తోంది. ఇంతటితో ఆగకుండా తమ ప్రభుత్వానికి వివిధ మంత్రిత్వ శాఖలను కూడా ఏర్పాటు చేసి పాకిస్తాన్‌కి కంటిమీద కునుకు లేకుండా చేసింది. రక్షణ, న్యాయ, సమాచార, ఇంటెలిజెన్స్, విద్యా, ఆర్ధిక వ్యవహారాలు, నిర్మాణ శాఖలను ఏర్పాటు చేసి మంత్రులను కూడా నియమించింది. దీంతో అప్రమత్తమైన పాకిస్తాన్ సోమవారం ప్రధాని షెహబాజ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించింది. అనంతం హోంమత్రి రాణా సనావుల్లా మాట్లాడుతూ తమ శత్రువులకు షెల్టర్ ఇస్తే ఆఫ్ఘాన్‌లోకి చొరబడి వేటాడుతామని హెచ్చరించారు. దీంతో మండిపడిన తాలిబన్లు.. అదే జరిగితే 1971లో భారత్ చేతిలో ఎదురైన దారుణ పరాభవం ఈ సారి తమ చేతిలో ఎదురవుతుందని గట్టి కౌంటర్ ఇచ్చి పడేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోని పాక్ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది.