మాట తప్పిన తాలిబన్లు..అమ్మాయిలు చదువుకోవద్దు! - MicTv.in - Telugu News
mictv telugu

మాట తప్పిన తాలిబన్లు..అమ్మాయిలు చదువుకోవద్దు!

March 23, 2022

తాలిబన్లు మరోసారి మాట తప్పారు. బాలికలు హైస్కూల్​ విద్యను అభ్యసించేందుకు అనుమతి లేదంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. గతకొన్ని నెలల క్రితం బాలికలను హైస్కూల్​ విద్యకు అనుమతిస్తున్నట్లు ప్రకటించిన తాలిబన్లు.. బుధవారం అనుమతి ఇవ్వటంలేదని ప్రకటించారు. స్కూల్స్‌ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే తమ నిర్ణయాన్ని మార్చుకున్నామని షాకిచ్చారు.

ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ దేశాన్ని గుర్తించేందుకు విధంగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.అందులో భాగంగా బాలికలకు ఉన్నత చదువులు అందించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. కానీ,తాజాగా మాట మార్చుతూ బాలికలను చదువుకు దూరం చేశారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించట్లేదని, ఆరవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. దీంతో ఉన్నత చదువులు చదవాలని కలలు కన్న అక్కడి బాలికలు ఆవేదనకు గురవుతున్నారు.

ఈ సందర్భంగా తాలిబన్లు మాట్లాడుతూ..’ ఈ నిర్ణయానికి ప్రధాన కారణం గ్రామీణ ప్రజలే. గ్రామీణ ప్రాంత, గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారు వారి పిల్లలను స్కూల్స్‌కు పంపేందుకు అంగీకరించడం లేదు. అందుకే బాలికలకు ఉన్నత విద్యను నిషేధిస్తున్నట్లు ప్రకటించాం’ అని పేర్కొన్నారు.