Talibani commander uses military helicopter to take newly-wed bride home
mictv telugu

మిలటరీ హెలికాప్టర్‌లో భార్యని తీసుకెళ్లిన తాలిబన్.. వైరల్ అవుతున్న ఫోటోలు

July 4, 2022

Talibani commander uses military helicopter to take newly-wed bride home

కొత్తగా పెళ్లైన తాలిబన్‌ కమాండర్‌ ఒకరు.. నవ వధువైన తన భార్యను ఇంటికి తీసుకెళ్లేందుకు మిలిటరీ హెలికాప్టర్ ఉపయోగించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించి ఆఫ్గాన్ మీడియా.. తాలిబన్ కమాండర్ తన భార్యను తీసుకుని ఆ చాపర్‌లో అప్గనిస్తాన్‌లోని లోగర్‌ నుంచి ఖోస్ట్‌ ప్రావిన్స్‌ వెళ్లినట్లు తెలిపింది. ఆ వ్యక్తిని హక్కాని శాఖ కమాండర్‌గా పేర్కొంది. ఆ వ్యక్తి ఆమెని వివాహం చేసుకునేందుకు తన మామగారికి దాదాపు రూ. 10 లక్షలు పైనే చెల్లించాడని వెల్లడించింది. అంతేగాక ఆ వ్యక్తి ఖోస్ట్‌లో నివసిస్తున్నాడని, అతని భార్య పుట్టిల్లు లోగర్‌లోని బార్కి బరాక్‌ జిల్లాలో ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయంటూ కథనాలు వచ్చాయి.
ఈ విషయమై తాలిబన్‌ డిప్యూటి అధికార ప్రతినిధి ఖారీ యూసుఫ్‌ అహ్మదీ స్పందిస్తూ… మీడియాలో వస్తున్న కథనాలను ఖండించారు. ఇదంతా శత్రువులు చేస్తున్న తప్పుడూ ప్రచారంగా పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఆరోపణలను ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ తోసిపుచ్చింది కూడా. ఐతే ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ప్రజలు ఈ చర్యను ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. ఇది ప్రజా ఆస్తులను దుర్వినియోగపరచడం కిందకే వస్తుందంటూ ప్రజలు పెద్ద ఎత్తున మండిపడ్డారు.