నా దగ్గరికొచ్చి మాట్లాడండి.. చినజీయర్ - MicTv.in - Telugu News
mictv telugu

నా దగ్గరికొచ్చి మాట్లాడండి.. చినజీయర్

March 18, 2022

bdhd

తెలంగాణ రాష్ట్రంలో చినజీయర్ స్వామి సమ్మక్క, సారలమ్మలపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయన దిష్టి బోమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం చినజీయర్ స్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ”కొంతమంది పనిగట్టుకొని వివాదం రేపుతూ.. టీవీల్లో వాళ్ల వాళ్ల ముఖాలను ప్రదర్శిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ హడావుడి తగ్గడంతో ఈ ప్రచారం చేస్తున్నారు. 20 ఏళ్ల కింద అన్నమాట గురించి వివాదం జరిగినట్టు నా దృష్టికి వచ్చింది. గ్రామ దేవతల్ని కించపరిచినట్టుగా ఆరోపణలు వచ్చాయి. మేము ఎప్పుడూ అలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయలేదు. ఈ అంశంపై మాట్లాడాలని అనుకునేవాళ్లు. నా దగ్గరికి నేరుగా వచ్చి మాట్లాడండి. అందరం కలిసి సమాజం కోసం పనిచేద్దాం” అని అన్నారు.

అంతేకాకుండా తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే.. వారిపై జాలిపడాల్సి వస్తుంది. కొందరు సొంత లాభం కోసమే వివాదం చేస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముస్లిం, క్రిస్టియన్స్‌ కూడా వస్తుంటారు. మాకు కులం, మతం అనే తేడా లేదు. అందరిని గౌరవించాలనేది మా విధానమని అన్నారు. మహిళలను చిన్న చూపు చూసేవారిని ప్రోత్సహించమని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని సమస్యగా మారుస్తున్నారని, సమాజ హితం లేనివారే ఇలాంటి అల్ప ప్రచారం చేస్తున్నారని చినజీయర్‌ స్వామి ఆక్షేపించారు.