దేశంలో మరో మూడు బ్యాంకులు కనుమరుగు.. - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో మరో మూడు బ్యాంకులు కనుమరుగు..

June 3, 2020

3 Another Banks.

బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే చాలా బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేసింది. అయితే ఇప్పుడు మరో మూడు బ్యాంకులను కూడా విలీనం చేయాలని కేంద్రం భావిస్తోంది. నీతి ఆయోగ్ మరోమారు బ్యాంకుల విలీన ప్రతిపాదనపై ప్రభుత్వ అధికారులు చర్చలు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించడం ద్వారా భవిష్యత్తులో బెయిలౌట్లను నిలిపివేయాలనేది ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశ్యమని తెలుస్తోంది. ఈసారి బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లను విలీనం చేయాలని భావిస్తోంది.

కాగా, కేంద్రం ఇటీవలే 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేసిన విషయం తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంకులు కలిసిపోయాయి. పీఎన్‌‌బీ ఈ బ్యాంకుల కార్యకలాపాలు చూసుకుంటోంది. ఇండియన్ బ్యాంక్‌ను అలహబాద్ బ్యాంక్‌‌తో విలీనం చేశారు. దీంతో 7వ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌గా ఆవిర్భవించింది. ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్‌లు వీలినం అయ్యాయి. దీంతో ఇది 5వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా నిలిచింది. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంకులను వీలీనం చేయడంతో 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏర్పడింది.