భారత్‌లో అత్యంత ఎత్తయిన భవనం.. విశేషాలు ఇవీ.. - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో అత్యంత ఎత్తయిన భవనం.. విశేషాలు ఇవీ..

April 16, 2019

భారత్ ఇటీవల సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని నెలకొల్పిన ఘనత సాధించింది. మరి మనదేశంలో అత్యంత ఎత్తయిన భవనం ఏది? దీనికి సమాధానం కోల్‌కతాలోని 268 మీటర్ల (879 అడుగులు) గగనహర్మ్యం. చౌరంగీ లేన్(జీఎన్ రోడ్)లోని ఉంది. పేరు ‘ది 42’.

Tallest building in india 268 metres building Kolkata high-rise the 42 becomes tallest building in the country

ఇటీవలే 65వ అంతస్తుకు స్లాబ్ వేశారు. హుగ్లీనదికి ఎదురుగా ఉన్న ఈ భవనం నగరంలోని ఇతర ఆకాశహర్మ్యాలను దిష్టిబొమ్మల్లా మార్చేసింది. అల్కోవ్ రియాల్టీతోపాటు రెండు కంపెనీలు కలిసి దీన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటీయర్ పనులు సాగుతున్నాయి. ఆగస్టులో ఇందులోకి కుటుంబాలు రానున్నాయి. ఈ పొడవాటి భవనం తమకు వల్ల గాలి, వెలుతురు రాక ఇబ్బంది పడతామని, కూలిపోతే చచ్చిపోతామని కొందరు కోర్టుకు కూడా ఎక్కారు. అయితే కోర్టు వారి వాదనను తోసిపుచ్చింది. ‘ది 42’కు ముందు మన దేశంలో అత్యంత ఎత్తయిన భవనంగా ముంబైలోని ఇంపీరియల్ బిల్డింగ్(256 మీటర్లు) ఉండేది.