నాకు నిజంగా పెళ్ళైనా నమ్మేరేమో అంటోంది వైట్ బ్యూటీ తమన్నా. ప్రతీ శుక్రవారం తనకు పెళ్ళి చేస్తున్నారని సెటైర్ వేసింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ అంటూ వస్తున్న వార్తల మీ ఇలా స్పందించిందీ మిల్కీ బ్యూటీ. మేమిద్దరం కలిసి ఒక్కటే సినిమా చేశాం. దానికే ఇంతలా రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నారంటూ నెత్తి కొట్టుకుంటోంది.
హీరోయిన్ల మీద వచ్చిన రూమర్లు ఇంకెవ్వరి మీదా రావు అదేంటో ఆశ్చర్యం వక్తం చేసింది తమన్నా. మాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందో అర్ధం కాదంటూ వాపోయింది. కెరియర్ లో ఉన్నన్నాళ్ళు మాకు ఎంత మందితో పెళ్ళి చేస్తారో లెక్కే ఉండదు. వైద్యుల నుంచి వ్యాపారవేత్తల దాకా అందరితోనూ పెళ్ళైపోతోంది. ఇలానే ఉంటే కొన్నాళ్ళకు అసలు మేము నిజంగా పెళ్ళి చేసుకున్నా నమ్మరేమో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.
అనవసన విషయాలను తానేమీ పట్టించుకోను అని చెబుతోందీ హ్యాపీడేస్ ఫేమ్. రూమర్ల మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరమూ లేదని చెబుతోంది.