మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గోవాలో జరిగిన న్యూఇయర్ పార్టీలో రెచ్చిపోయింది. ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఎంజాయ్ చేస్తుండగా తీసిన వీడియో లీక్ అవడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు గుట్టుగా కొనసాగుతున్న వీరి వ్యవహారం ఇప్పుడు లీక్ కావడంతో అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వీడియో చూసిన కొందరు క్రేజీ కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 2005లో బాలీవుడ్ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంటరయిన తమన్నా తర్వాత దక్షిణాది సినిమాల్లో అగ్రహీరోలందరితో స్క్రీన్ పంచుకుని ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. అటు ప్రియుడు విజయ్ వర్మ 2012లో చిట్టగాంగ్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఇతను మన నేచురల్ స్టార్ నాని నటించిన ఎంసీఏ చిత్రంలో విలన్ గా చేశాడు. నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఓ వెబ్ సిరీస్ కోసం వీరిద్దరూ పని చేయగా, అక్కడే పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసిందని బాలీవుడ్ వర్గాలు చెప్తున్న విషయం. మరి ఈ రిలేషన్ షిప్ పెళ్లి వరకు వెళ్తుందా? లేక మధ్యలోనే బ్రేక్ అవుతందా? అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి :
కోవై సరళే.. ఆస్కార్డ్ రేంజ్ నటన, కామెడీ కాదు, సీరియస్!
పదిరోజుల్లో 89 కోట్లు.. కొసాగుతున్న రవితేజ మార్క్
‘మా సినిమా చూస్తే.. రూ.లక్ష బహుమతి ఇస్తాం.. కానీ ఓ కండీషన్’
బుద్దుందా నీకు.. మైక్ దొరికిందని మతి లేకుండా వాగొద్దు..!