తమన్నాను అరెస్ట్ చేయాలి.. యువతను చెడగొడుతోందని పిటిషన్ - MicTv.in - Telugu News
mictv telugu

తమన్నాను అరెస్ట్ చేయాలి.. యువతను చెడగొడుతోందని పిటిషన్

July 31, 2020

Tamannaah Bhatia, Virat Kohli accused of allegedly promoting online gambling; PIL filed seeking their arrest.

యువతను చెడగొడుతోన్న సినీనటి తమన్నాను అరెస్ట్ చేయాలని పిటిషన్ దాఖలైంది. తమన్నాతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో ఓ న్యాయవాది శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. వారిద్దరు ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ యాప్స్‌కు సంబంధించి ప్రమోషన్‌ చేస్తున్నారని చెన్నైకి చెందిన సదరు న్యాయవాది సూర్యప్రకాశ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. యాప్‌ల ద్వారా నిర్వాహకులు యువతను పెడదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

వారి విషయంలో ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని.. అత్యవసర విచారణ జరపాలని కోరారు. మరోవైపు ఆన్‌లైన్‌లో ఉన్న మోసపూరిత యాప్‌లను నిషేధించాలని కోర్టును కోరారు. ఇలాంటి యాప్‌లను వినియోగించి యువత మోసపోతున్నారని, కొన్నిసార్లు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఇటీవల జరిగిన ఒక ఘటనను ఉదహరించారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.