Tamannaah's hot comments on cine industry..they don't give that courtesy
mictv telugu

సీనీ పరిశ్రమలపై తమన్నా ఫైర్..కనీసం అది కూడా ఇవ్వరు

August 11, 2022

దక్షిణాది సీనీ ప్రియులకు ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా అంటే తెలియని వారుండరు. ఎందుకంటే ఆమె తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించి కుర్రకారును తన అందంతో, డ్యాన్స్‌తో, నటనతో మెప్పించి, మిల్క్ బ్యూటీగా పేరుగాంచింది. అయితే, తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా..సినిమా ఇండస్ట్రీలలో హీరోయిన్స్‌కు ఇచ్చే మర్యాదలపై సంచలన కామెంట్స్ చేసింది.

తమన్నా మాట్లాడుతూ.. ”సినీ పరిశ్రమలో మనుషుల మధ్య చాలా తేడాలు చూపిస్తారు. వీటి గురించి మహిళ ఆర్టిస్టులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. నేను పని చేసిన సినిమాల్లో ఏ అంశం గురించి అయినా మాట్లాడితే, సజెషన్స్ ఇస్తే టెక్నీషియన్స్ వాటిని పట్టించుకునేవారు కాదు. మహిళలకు సినిమా రంగంలో సరైన మర్యాద లేదు. హీరోయిన్స్ అంటే.. హీరోలని ప్రేమించే పాత్రలకే తీసుకుంటారు తప్ప మిగతా పాత్రలకు తీసుకోరు. ఒకప్పుడు నా విషయంలో కూడా ఇదే జరిగింది.” అని ఆమె అన్నారు.

అనంతరం పారితోషికం గురించి తమన్నా సంచలన విషయాలను వెల్లడించారు. ‘హీరోలకి ఇచ్చేదాంట్లో సగం కూడా హీరోయిన్‌కు ఇవ్వరు. గుర్తింపు అయితే అసలు ఉండదు. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో హీరోలు పాల్గొనకపోయినా, పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ, హీరోయిన్లు పాల్గొనకపోతే వెంటనే వారికి దర్శక, నిర్మాతలతో సమస్యలు, విభేదాలు అంటూ ప్రచారం చేస్తారు. ఈ పరిస్థితులు మారాలి’ అని తమన్నా అన్నారు.

ఇక, సినిమా పరిశ్రమల విషయానికొస్తే..ఆయా ఇండస్ట్రీలలో హీరోలకి, హీరోయిన్స్‌కి, మిగిలిన ఆర్టిస్టుల మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. ఎవరి రేంజ్‌కి తగ్గట్టు వారికి సౌకర్యాలు, మర్యాదలు ఉంటాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ, కొంతమంది దీనిపై బహిరంగంగానే మాట్లాడతారు. ఇటీవల కొంతమంది హీరోయిన్స్ హీరోలని ఒకలా, మమ్మల్ని ఒకలా చూస్తారు అని తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి తమన్నా చేరింది. ప్రస్తుతం తమన్నా చేసిన వ్యాఖ్యలపై పలువురు హీరోయిన్స్ స్పందిస్తూ..’అవును అన్నీ ఇండస్ట్రీలలో ఉన్న హీరోయిన్స్ అంతా..ఈ సమస్యను ఎదురుకుంటున్నారు’ అని తమన్నాకు సపోర్ట్ చేస్తున్నారు.