సంగీత్ లో అట్రాక్షన్ తమన్నా నే.... - MicTv.in - Telugu News
mictv telugu

సంగీత్ లో అట్రాక్షన్ తమన్నా నే….

July 1, 2017

అందాల నటి తమన్నా సంగీత్ వేడుకలో తళుక్కుమంది. ఇంతకీ సంగీత్ తమన్నాది అనుకునేరు !? కాదు కాదు తన తొడబుట్టిన వాడిది.అయన పేరు ఆనంద్ భాటియా. ఆనంద్ అమోరికా లో డాక్టర్ గా పని చేస్తున్నాడు. పెళ్లి కృతిక చౌదరి అనే అమ్మాయితో తొందరలోనే జరగనుంది. జూన్ 29 న ముంబాయిలో అత్యంత ఉత్సాహంగా సంగీత్ వేడుక జరిగింది. ఈ సంగీత్ కార్యక్రమంలో తమన్నా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి అందర్ని ఆకార్షించింది.మెహంది పెట్టుకున్న చేతులతో , గార్జియస్ తమన్నా, అభిమానులకు కనువిందు చేసింది . ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

మీల్కీ బ్యూటీ తమన్నా తన అందం , నటనతో తెలుగు , తమిళ్, హిందీ సినిమాలలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చకుంది . ప్రత్యేకమైన పాత్రలతో ప్రేక్షకులని అలరించడంలో తమన్నా ఫస్టుంటుంది.ముఖ్యగా‘బాహుబలి ’మెదటి భాగంలో అవంతిక పాత్రలో ప్రేక్షకులని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.