పాకిస్తానీతో తమన్నా పెళ్ళి! - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తానీతో తమన్నా పెళ్ళి!

September 5, 2017

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా  త్వరలోనే పెళ్ళి చేసుకోనుందా ? ఆమె పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ను పెళ్లాడనుందని వార్తలు గుప్పుమంటున్నాయి.  వీరిద్దరూ  కలిసి దిగిన ఒక ఫోటో ఆధారంగా ఈ దూమారం చెలరేగింది. 2013 లో దుబాయ్ లో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు తమన్నా, రజాక్ వెళ్ళారట. అక్కడ క్లిక్కుమన్న ఫోటోను పట్టుకుని తమన్నా తన ప్రియుడితో కలిసి షాపింగ్ కు వెళ్ళిందనే రూమర్ బయటకొచ్చింది. ఈ విషయం మీద తమన్నానే స్పందించాలి. తమన్నా  సన్నిహిత వర్గాలు మాత్రం ఆమెకు ఇప్పుడే పెళ్లి చేసుకునే  ఆలోచన లేదని చెప్తున్నారు. ఒకవేళ తను చేసుకుంటే అందరికీ టాం టాం వేసే చేసుకుంటుందన్నారు. అంతేకాకుండా.. రజాక్  కు ఇప్పటికే పెళ్లయిందని, పెళ్లయని వాడిని చేసుకునేంత ఖర్మ ఆమెకు పట్టలేదని అంటున్నారు.