‘తమసోమా జ్యోతిర్గమయ’పై ప్రశంసల వర్షం.. - MicTv.in - Telugu News
mictv telugu

‘తమసోమా జ్యోతిర్గమయ’పై ప్రశంసల వర్షం..

February 19, 2021

fvf

యువదర్శకుడు విజయ్ కుమార్ బడుగు తొలి చిత్రం తమసోమా జ్యోతిర్గమయ’పై ప్రశసంల వర్షం కురుస్తోంది. టాలీవుడ్‌లో మరో కొత్త కెరటం దూసుకొచ్చిందని సినీ విమర్శలు కొనియాడుతున్నారు. చేనేతకార్మికుల జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రివ్యూ షోను గురువారం ప్రదర్శించారు. దానిపై చేరాల ప్రకాష్ గారి స్పందన ఇది..

‘నిన్న రాత్రి పోచంపల్లి యువకుడు బడుగు విజయ్ రూపొందించిన ‘తమసోమా జ్యోతిర్గమయ’ చిత్రం ప్రసాద్ ల్యాబ్‌లో వీక్షించాను. నిజంగా ఓ కొత్త అనుభూతి కలిగింది. 2000 సంవత్సరం నుండి 2014 మధ్య చేనేత ప్రసిద్ధి పొందిన పోచంపల్లిలో జరిగిన ఓ సంక్లిష్ట పరిస్థితి నుండి చేనేత పరిశ్రమను ఓ యువకుడు ఎలా గట్టెక్కించాడనే ఇతివృత్తంతో విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

నిజంగా ఈ చిత్ర నిర్మాణం ఓ సాహసోపేతమైన నిర్ణయం. అన్న తడక రమేష్ గారు స్వతహాగా చేనేత కుటుంబంలో పుట్టి తన కులంలోని చేనేత కార్మిక వర్గం ఎదుర్కొన్న సమస్యలతోపాటు చేనేత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రయత్నంతో ఈ సినిమా నిర్మాణాన్ని తన భుజాలపై ఎత్తుకున్నారు అని నేను భావిస్తాను. నిజంగా ప్రివ్యూ మొత్తం చూసేంత వరకు ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ మేధావి వర్గం అయినటువంటి ఘంటా చక్రపాణి గారు, కట్టా శేఖర్ రెడ్డి గారు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస రావు గారు, ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు గారు, రచయిత జూలూరు గౌరీశంకర్ గారు, స్వామి రామానంద తీర్థ డైరెక్టర్ కిషోర్ గారు ఆద్యంతం వరకు ఎంతో ఆసక్తిగా తిలకించారు.

చిత్ర వీక్షణలో వారు పొందిన అనుభూతిని చివరగా వ్యక్తపరుస్తూ బడుగు విజయ్‌ని ఎంతగానో అభినందించారు. ఇలాంటి సినిమాలు కచ్చితంగా రావాలని తెలంగాణ ప్రాంతం నుంచే ఎక్కువగా రావాలని అందరూ ఆశించారు. ఇక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ దర్శకులు ఎన్ శంకర్ గారు అన్నారు. విజయ్‌కి మొదటి సినిమా అయినా ఎంతో నేర్పుగా అనుభవం ఉన్న దర్శకుడిగా పని చేశారని తన ప్రతిభ ఈ చిత్రంలో కనిపిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ సినిమాకు తాను వెన్నుదన్నుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. చిత్ర నిర్మాణంలో కెమెరా పనితనం ఎంత గొప్పగా ఉంది. అంతేకాదు పెద్దింటి అశోక్ కుమార్ గారు రాసిన ఓ పాట భవిష్యత్తులో యువతకు ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నాను. సంగీతం కూడా చాలా చక్కగా ఉంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ప్రతి సన్నివేశానికి అచ్చుగుద్దినట్టు ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. ఈ చిత్రంలో నటించిన వారంతా కొత్త వారైనప్పటికీ ఎంతో అనుభవమున్న నటులు గా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా హీరో తల్లి పాత్ర అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.

ఎన్నో ఆదర్శవంతమైన షార్ట్ ఫిలిం లకు దర్శకత్వం వహించిన విజయ్ ఈ చిత్రం ద్వారా ఓ మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా ఫ్రూ చేసుకోగలిగాడు.
మొత్తానికి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకునే పోచంపల్లి పట్టు చీర కు మరో కొత్త రంగు అద్దినట్టు గా ఈ చిత్రం చూసేవారికి కళ్ళకు ఆనందం కలిగించిందని నా భావన. ఈ తరహాలో మల్లేశం చిత్రం వచ్చినప్పటికీ దానికి తమసోమా జ్యోతిర్గమయ చిత్రానికి వైవిధ్య చాలా ఉంది. మల్లేశం చిత్రం ఆసు యంత్రం సృష్టికర్త చింతకింది మల్లేశం గారి జీవిత చరిత్ర ఆధారంగా తీశారు. కానీ తమసోమా జ్యోతిర్గమయ చిత్రం మొత్తం చేనేత పరిశ్రమలోని ప్రధాన సమస్యను తీసుకొని చిత్రీకరించారు. చీకటి నుండి వెలుగు వైపు కు అని ముందుగా చెప్పే క్యాప్షన్ చాలా బాగా నచ్చింది. నిజంగా ఈ చిత్రం కూడా అలానే ఉంది. ఈ చిత్రంకు మొదట ఎందరో కళాకారులు అని టైటిల్ పెట్టారు. తర్వాత తమసోమా జ్యోతిర్గమయ మార్చారు. టైటిల్ కు సినిమాకు ఎంతో భావసారూప్యత ఉంది. ఈ సినిమాకు ఆ టైటిల్ అచ్చుగుద్దినట్టు సరిపోయింది. బడుగు విజయ్ కుమార్ మునుముందు ఎన్నో వినోదాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి భవిష్యత్తును అందుకోవాలని ఆశిస్తన్నాను.

మీ చేరాల ప్రకాష్
8919407586