పడితే 50 పైసలు..పెరిగితే 100 రూపాయలు... - MicTv.in - Telugu News
mictv telugu

పడితే 50 పైసలు..పెరిగితే 100 రూపాయలు…

July 11, 2017

ఇదేదో పొడుపు కథ కాదు..విప్పడానికి…చెప్పుకోవడానికి… కర్రీ వండాలంటేనే వర్రీ అయ్యే టమాటా. పడిపోతే యాభై పైసాలకు పడిపోతుంది. పెరిగితే వంద రూపాయలు దాటుతుంది. ఇంచుమించు చికెన్ రేట్ తో టమాటా పోటీపడుతోంది. ఎందుకిలా..?

టమాటా ను నమ్మిన రైతు ఎప్పుడు మునిగిపోతూనే ఉన్నాడు. లక్కు కలిసి వస్తే తప్ప. దిగుబడి వచ్చినప్పుడు ధర ఉండదు..ధర బాగా ఉన్నప్పుడు దిగుబడి ఉండదు.టమాటా రైతులు ఎప్పుడు మునిగిపోతూనే ఉన్నారు. కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. తోటల్ని పశువులకు వదిలేస్తున్నారు. దిగుబడి లేనన్నప్పుడు.. రైతులనుంచి 20 నుంచి 30 రూపాయలకు దళారులు కొంటారు. దాన్నే మార్కెట్ లో వందరూపాయలకు అమ్ముతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మార్కెట్ లో టమాటా దాదాపు వంద రూపాయలు పలుకుతుంది.

దిగుబడి ఎక్కువగా ఉంటే అసలు ధర ఉండదు..యాభై పైసాలకు ఇస్తే ఇవ్వండి.. లేదంటే మీ ఇష్టం అని రైతులకు చెప్పేస్తారు. అందుకే మార్కెట్ కు తెచ్చినా లాభం లేదని రోడ్లపై పోస్తారు. లేదా తోటను పశువులకు వదిలేస్తారు. ఇంకెంత కాలం టమాటా కష్టాలు.. అందుకే టమాట తోట వేయాలంటేనే అన్నదాత భయపడుతున్నాడు. ఇది వేసే బదులు వేరే తోటదైనా బెటర్ అనుకుంటున్నాడు.

అందరు రైతులు ఇలాగే అనుకుంటే..భవిష్యత్ లో టమాటను కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తుందేమో..జర ఆలోచించండి సారూ..టమాటాకు గిట్టుబాటు లభించేలా… ధర అందుబాటులో ఉండేలా…