సూర్య కొత్త సినిమా ట్రైలర్ వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

సూర్య కొత్త సినిమా ట్రైలర్ వచ్చేసింది..

October 26, 2020

nvnh

తమిళ నటుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో దీనిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుకుంది. 

ఈ సినిమాకు వెంకటేష్‌తో ‘గురు’ రూపందించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తుంది. సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్, 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందింది. ఇందులో మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.