Home > Featured > బిచ్చగాడు హీరో సాయం..పారితోషికం తగ్గించుకున్నాడు..

బిచ్చగాడు హీరో సాయం..పారితోషికం తగ్గించుకున్నాడు..

Tamil actor Vijay Antony to reduce salary by Rs 1 crore

కరోనా వైరస్ కారణంగా సినిమా రిలీజ్ లు, షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెల్సిందే. దీంతో నిర్మాతలకు నష్టాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన సినిమాల నిర్మాతలను ఆదుకోవడానికి తమిళ నటుడు విజయ్ ఆంటోనీ ముందుకు వచ్చారు.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న తన మూడు సినిమాలకుగాను పారితోషికంలో 25 శాతం తగ్గించుకుంటున్నట్లు విజయ్ ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 'తమీజసరన్', 'అగ్ని సిరాగుగల్', 'ఖాకీ’ చిత్రాలకు ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆయన తెలిపారు. విజయ్, తెలుగులో విజయ్ ఆంటోని.. బిచ్చగాడు, బేతాళుడు, రోషగాడు, కిల్లర్‌ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. లాక్‌డౌన్ కారణంగా నష్టపోయిన సినీ పరిశ్రమను ఆదుకోవాలంటే.. నటీనటులు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని నిర్మాతలు అభిప్రాయపడుతున్న తరుణంలో విజయ్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

Updated : 6 May 2020 4:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top