నటుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు..టెన్షన్ టెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

నటుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు..టెన్షన్ టెన్షన్

July 5, 2020

 

cnvbnvn

గత కొన్ని రోజులుగా వరుసగా తమిళ నటులకు బాంబు కాల్స్ ఎక్కువయ్యాయి. ఇటీవల తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటికి ఓ ఎనిమిదో తరగతి కుర్రాడు బాంబు బెదిరింపు కాల్ చేసిన సంగతి తెల్సిందే. 

తాజాగా మరో నటుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బాంబులతో హీరో ఇంటిని పేల్చేస్తామని బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. హీరో విజయ్ ఇంటిని తనిఖీలు చేసి బందోబస్త్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విజయ్ ‘మాస్టర్’ సినిమాలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది.