హీరో విజయ్‌పై ఐటీ దాడులు.. షూటింగ్ స్పాట్‌కు వెళ్లి మరీ! - MicTv.in - Telugu News
mictv telugu

హీరో విజయ్‌పై ఐటీ దాడులు.. షూటింగ్ స్పాట్‌కు వెళ్లి మరీ!

February 5, 2020

తమిళ నటుడు విజయ్‌కు ఆదాయపన్ను శాఖ షాకిచ్చింది. కడలూరు జిల్లాలో ‘మాస్టర్’ సినిమా షూటింగ్‌లో ఉన్న విజయ్‌ను ఐటీ అధికారులు బుధవారం ఉదయం నుంచి ప్రశ్నిస్తున్నారని సమాచారం. విజయ్‌కు చెందిన ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన సంస్థల్లో ఐటీ శాఖలు సోదాలు జరుపుతోంది. ఆ సంస్థకు చెందిన సుమారు 20 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. 

2019లో విడుదలైన ‘బిగిల్‌’ సినిమాకు సంబంధించి విజయ్ ఎంత పారితోషకం తీసుకున్నారు? ఏ రూపంలో తీసుకున్నారు? వాటిని ఏ రూపంలో విజయ్ ఖర్చు చేశారన్న తదితర అంశాలపై ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఏజీఎస్ సంస్థ లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. విజయ్ నుంచి సంతృప్తికర సమాచారం రాకుంటే..ఇంటికి తీసుకెళ్లి విచారణ జరిపే అవకాశం ఉందట. ఈ వార్తల నేపథ్యంలో విజయ్ ఇంటి వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.