తిట్టడానికి హిందూ దేవుళ్లే దొరికారా? విజయ్‌పై మహాసభ కన్నెర్ర
Editor | 9 May 2020 12:36 AM GMT
తమిళ నటుడు విజయ్ సేతుపతిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందూ దేవుళ్లకు జరిగే అభిషేకం, అలంకరణ, కైంకర్యాలను తప్పుబడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అఖిల భారత హిందూ మహాసభ ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత ప్రచారం కోసం హిందూ దేవుళ్లు మాత్రమే దొరికారా అంటూ ప్రశ్నించారు.
ఇటీవల ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో విజయ్ సేతుపతి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ మహాసభ తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు లేఖ రాసింది. విజయ్ ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా ఈ అంశం వైరల్ కావడంతో నెటిజన్లు కూడా విజయ్ తీరును తప్పుబడుతున్నారు.
Updated : 9 May 2020 12:36 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire