సినీ పరిశ్రమలో విషాదం.. దర్శకుడు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

సినీ పరిశ్రమలో విషాదం.. దర్శకుడు మృతి

September 18, 2020

xmns

తమిళ సినీ పరిశ్రమలో విషాదం జరిగింది. దర్శకుడు బాబు శివన్‌(54) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. నటుడు విజయ్‌ హీరోగా నటించిన ‘వేట్టైక్కారన్’ చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. అలాగే విజయ్‌ హీరోగా ఏవీఎం సంస్థ నిర్మించిన ‘కురివి’ సినిమాకు మాటలు అందించారు. 

ఆయన గత కొంతకాలంగా కాలేయం, ఊపిరితిత్తులు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేశారు. బుధవారం పరిస్థితి విషయమించి మరణించారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు శివన్‌ మృతితో తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. నటుడు విజయ్ ఆంటోని.. బాబు శివన్ మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.