కాపాడండి.. సీఎంకు దర్శకుడి అభ్యర్థన - MicTv.in - Telugu News
mictv telugu

కాపాడండి.. సీఎంకు దర్శకుడి అభ్యర్థన

October 28, 2020

Tamil Director tweet to cm

తమిళనాట శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ బయోపిక్ నుంచి నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్న సంగతి తెల్సిందే. తాజాగా ఈ వివాదం కారణంగా ప్రముఖ తమిళ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత శీను రామస్వామికి బెదిరింపులు వస్తున్నాయి. 

దీంతో ఆయన తమిళనాడు సీఎంకు అభ్యర్థన పెట్టుకున్నారు. తన జీవితం ప్రమాదంలో ఉందని, కాపాడాలని ఆయన ట్వీట్ చేశారు. ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవాలని కోరిన వారిలో రామస్వామి ఒకరు. అలా అన్నందుకు కొందరు ఆయనకు బెదిరింపు కాల్స్‌, మెసేజ్‌లు చేస్తున్నారని గతంలో ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టి వెల్లడించారు. విజయ్ సేతుపతికి, తనకు మధ్య శత్రుత్వం పెంచేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అయితే విజయ్ సేతుపతితో, రామ స్వామికి కాంబినేషన్ లో ఐదు సినిమాలు రూపొందాయి.