TAMIL MUSIC SINGER, MUSIC DIRECTOR ARIVU WINS OSCAR, TAMIL, MUSIC, SINGER,
mictv telugu

దళిత పాటకు ఆస్కార్….బెస్ట్ ఇన్స్పైరింగ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ గా ఎన్నిక

November 7, 2022

ఈ అబ్బాయిని చూడండి….ఇతనో యంగ్ రాపర్. పేరు అరివు. తమిళ్ నేపథ్య గాయకుడు , ఫోక్, జాజ్ పాటగాడు.. రాతగాడు..28 తమిళ్ సినిమాలకు ర్యాప్ మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు ఇతని గురించి ఒక్క తమిళనాడులో మాత్రమే కాదు మొత్తం ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది. ఎందుకో తెలుసా….ఎందుకంటే ఇతను కంపోజ్ చేసిన పాటకు ఆస్కార్ లభించింది కాబట్టి.

చెన్నై నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరక్కోణం టౌన్లో పుట్టి పెరిగాడు అరివు.టీవీ రేడియో కూడా లేని ఇంట్లో పెరిగినా సంగీతం పట్ల మక్కువ అరివును తమిళ్ జానపద కళను కెరీర్ గా చేసుకోవడానికి కారణమైంది.తల్లిదండ్రులు సంగీతం వదిలి ఉద్యోగం చూసుకోమన్నారు.వాళ్ళ బలవంతం మీద ఎంబీఏ లో చేరాడు. కానీ అక్కడ పా.రంజిత్ తో పరిచయం అతని జీవితాన్ని మలుపుతిప్పింది. మొదట పా .రంజిత్ బ్యాండ్ ” The casteless collective ” మ్యూజిక్ గ్రూప్ తో ఎన్నో ఆల్బమ్స్ చేసాడు.ఒప్పరి , హిప్ హాప్ ,గానా ఫోక్ లో ప్రయోగాలు చేసాడు.పా.రంజిత్ సూపర్ హిట్ మూవీ ” కాలా ” కు పనిచేశాడు.కాలా లో ‘ తెరుక్కురల్’ రాప్ అతనికి మంచి పేరు తెచ్చింది.

సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ ఫ్యామిలీ మ్యాన్ ‘ లో మావిరార్ మారణం , మండేలా మూవీ లో ‘ ఏలో ఏలో ‘ తోపాటు ‘ జై భీమ్ ‘ సినిమాలో ” పవర్ ” పాటలు అరివు చేసినవే. ఇతను సంతోష్ నారాయణ్ , ఢీ… నిర్మాతలుగా ” మజ్జ” అనే మ్యూజిక్ గ్రూప్ తో టై అప్ చేసుకున్నాడు..వాళ్ళిద్దరి నిర్మాణం లో ” Enjoy Enjaami ” అనే మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ చేశారు.ఈ ఆల్బమ్ అరివు తన మామ్మ దగ్గర నేర్చుకున్న జానపదం తో , దళిత నేపథ్యంతో , అక్కడి నేల తో , నీటితో ఉన్న అనుబంధాన్ని ఉటంకిస్తూ అద్భుతమైన పాటలు వ్రాశాడు.ఈ ఆల్బమ్ ఏ.ఆర్ రెహ్మాన్ చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది.ఎంజాయ్ ఎంజిమన్ 400 మిలియన్ వ్యూస్ తో దేశవిదేశాల్లో గొప్ప క్రేజ్ సంపాదించుకుంది.ఆ ఆల్బంలో నటించిన శ్రీలంక నటుడికి నిర్మాతలకు బోలెడు అవార్డులు వచ్చాయి.

అయితే ఈ ఆల్బమ్ కు ఇన్ని వ్యూస్ రావడానికి కారణమైన అరివు ను మాత్రం పూర్తిగా ప్రక్కన బెట్టారు.ప్రఖ్యాత అంతర్జాతీయ మ్యూజిక్ మ్యాగజైన్ “‘ రోలింగ్ స్టోన్” ‘ఎంజాయ్ ఎన్ జిమన్ స్పెషల్ స్టోరీ లో కూడా అరివు కాంట్రిబ్యూషన్ ను ప్రస్తావించలేదు.కవర్ పేజ్ పై నిర్మాతల ఫొటోలతో పాటు అరివు ఫోటో వెయ్యకపోవడం తీవ్ర దుమారం లేపింది. రోలింగ్ స్టోన్ ను విమర్శిస్తూ పా.రంజిత్ ట్వీట్ కూడా చేసాడు.అరివును వాడుకొని అతన్ని ప్రక్కకు బెట్టడం వివక్ష అని అన్నాడు కూడా.

ఏం జరిగినా, ఎలా అయినా కూడా అరివు ఒక్క మాట మాట్లాడలేదు. తన పనిని మాత్రమే నమ్మకున్నాడు. తనకు గుర్తింపు లభించలేదని ఎక్కడా ఒక్క మాట కూడా అనలేదు. అదే ఈరోజు అతన్ని ఉన్నతంగా నిలబెటంటింది. ఎవరు విమర్శించినా తన పని తాను చేసుకోవడం మాత్రమే తెలిసిన అరివు కు గొప్ప గౌరవం లభించింది.అతను వ్రాసి సంగీతం చేకూర్చిన సారపట్ట పరంబరై మూవీలోని…. నీఏ ఓలి పాటకు ఆస్కార్ పురస్కారం లభించబోతుంది. ఈ పాట బెస్ట్ ఇన్స్పైరింగ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ గా ఎన్నికైంది….

ఈ విషయం తెలిసి పా. రంజిత్ తో పాటు తమిళులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అరువి యూ రాక్ అంటూ విషెస్ చెబుతున్నారు. అరువి ఇలాంటివి మరిన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నిజంగానే అరువి లాంటి వాళ్ళు అందరికీ మంచి ఇన్సిపిరేషన్ కదండీ.