బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు  - MicTv.in - Telugu News
mictv telugu

బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు 

October 26, 2019

borewell..

బోరు బావుల విషయంలో జాగ్రత్త వహించాలని ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా.. ఇంకా బోరుబావిలో చిన్నారులు పడుతూనే ఉన్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రం తిరుచురాపల్లి జిల్లాలో రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. 

శుక్రవారం సాయంత్రం సుజిత్ అనే బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు సమాచారం అందించడంతో అధికారులు, పోలీసు యంత్రాంగం అక్కడికి చేరుకుంది. బోరుబావిలోకి కెమెరాలను పంపి పరిశీలించగా బాలుడి కదలికలు కనిపించాయి. చిన్నారిని సురక్షితంగా బయటకి తీసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఐఐటీ మద్రాసు తయారుచేసిన ప్రత్యేక పరికరం సహాయంతో రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.