Tamil Nadu bans Dandora
mictv telugu

అందరికీ తెలియజేయునది ఏమనగా.. దండోరాను నిషేధించారహో

August 4, 2022

తమిళనాడు రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. దండోరా ప్రచారాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో ముఖ్యమైన ప్రకటనలను దండోరా ద్వారా తెలియజేయడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామసభలు, ఇంటి పన్నుల చెల్లింపు, పంచాయితీ పనులు, ప్రభుత్వ ప్రకటనలు, వరద హెచ్చరికలు ఇలా ఏదైనా ప్రజలకు తెలియజేయాల్సిన విషయాలుంటే దండోరా ద్వారా చేసేవారు. అయితే టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో కూడా దండోరా వేయడంపై విమర్శలు వచ్చాయి. దాంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ఎలాంటి విషయాన్నైనా దండోరా ద్వారా ప్రచారం చేయవద్దని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ దండోరా విధానం నడుస్తోంది. మరి మన వద్ద కూడా నిషేధం విధించాలా? లేక వారి జీవనోపాధిపై దెబ్బ కొట్టినట్టవుతుందా? కామెంట్ చేయండి.