తాళి కట్టబోతుంటే లవర్ వచ్చేస్తున్నాడని పైకి లేచింది.. పాపం! - MicTv.in - Telugu News
mictv telugu

తాళి కట్టబోతుంటే లవర్ వచ్చేస్తున్నాడని పైకి లేచింది.. పాపం!

October 31, 2020

Tamil nadu bride stops wedding as she want lover

ఇంకో రెండు క్షణాల్లో మూడు మూళ్లే పడుతుండగా పెళ్లి కూతురు నో అంది. అచ్చం సినిమాలో మాదిరిగా.. ‘ఈ పెళ్లి నాకిష్టం లేదు. నా ప్రియుడు ఇంకో అరగంటలో వచ్చి నన్ను తీసుకెళ్తాడు.. ’ అనేసింది. పెళ్లికొడుక్కి దిమ్మతిరిగిపోగా, పెళ్లికొచ్చిన వాళ్లు ఇదెక్కడి చోద్యమమ్మా అని నోళ్లు నొక్కుకున్నారు. పరువు తీశావంటూ బంధవులు పెళ్లికూతురి చెంపలు వాయించారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. ‘జస్ట్ అరగంటలో నా లవర్ వచ్చేస్తాడు.. మీకంటే అతడే నాకు ముఖ్యం..’ అని తేల్చిచెప్పింది.. అరగంట గడిచింది.. తర్వాత ఏమైంది? 

తమిళనాడులోని నీలగిరి జిల్లా ఉదగ గ్రామంలో ఈ వింత చోటుచేసుకుంది. ప్రియదర్శిని అనే యువతికి, ఆనంద్ అనే యువకుడికి పొద్దున పెళ్లి చేయడానికి అంతా సిద్ధమైంది. పంతులు ‘మాంగల్యం తంతునానేన..’ అని కూడా అనేశాడు. అనంద్ తాళికట్టబోతుండగా ప్రియదర్శిని ‘కట్టకు.. నాకీ పెళ్లి ఇష్టం లేదు.. ’ అని పైకి లేచింది. పెద్దలు నచ్చజెప్పినా వినకుండా.. ‘వస్తాడు నా రాజు ఈ రోజు..’ అన్నట్లు మంకుపట్టింది. దీంతో పెళ్లికొడుకు తనకూ ఆమె వద్దంటూ వెళ్లిపోయాడు. అరగంట గడిచినా ఆ ప్రియుడు రాలేదు. ప్రియదర్శినికి ముఖం చెల్లలేదు. బంధువులను ఆమె తిట్లతో దీవించారు. ప్రియదర్శిని పార్తిబన్ అనే యువకుణ్ని ప్రేమించగా, పెద్దలు ఒప్పుకోకపోవడంతో అరేండ్జ్ మ్యారేజీకి తలవొగ్గింది.