జల్సాలకు అలవాటు పడి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఓ యువకుడు(17).. గొలుసు కొట్టేసి తిరిగివస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. తన స్నేహితుడితో కలిసి తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తుక్కలే ప్రాంతంలో బంగారు గొలుసు దొంగలించి తిరిగి బైక్పై వస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. తిరువనంతపురంలోని నరువామూడు వద్ద నేషనల్ హైవే పై డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్పై వెళుతున్న మరో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడిపై ఒక స్నాచింగ్ కేసు నమోదు కాగా, మరో వ్యక్తిపై కేరళలో 15 స్నాచింగ్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు వారు తెలిపారు.