రాజీవ్ హంతకుడు పెరరివలన్‌ను అభినందించిన సీఎం స్టాలిన్ - MicTv.in - Telugu News
mictv telugu

రాజీవ్ హంతకుడు పెరరివలన్‌ను అభినందించిన సీఎం స్టాలిన్

May 19, 2022

రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన ఏజీ పేరరివాల‌న్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు అదేశాల మేరకు నిన్న సాయంత్రం అధికారులు ఆయన్ను విడుదల చేశారు. 31 ఏళ్ల జైలు జీవితం నుంచి తొలిసారి బయట ప్రపంచంలోకి వచ్చిన ఆయన.. ఆ రోజు(బుధవారం)సాయంత్రమే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలుసుకోవడం గమనార్హం. కాగా, జైలు నుంచి ఇంటికి చేరుకోగానే పెరరివలన్ పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా పెరరివలన్‌కు శాలువా కప్పి పెళ్లి శుభాకాంక్షలు చెప్పారు సీఎం స్టాలిన్. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను స్టాలిన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘‘30 ఏళ్ల జైలు జీవితం గడిపి వచ్చిన నా సోదరుడు పెరరివలన్‌ను కలుసుకున్నాను. పెరరివలన్, తన తల్లి అర్పుతమ్మాళ్‌లను ఓ ఇంటిని ఏర్పాటు చేసుకుని సంతోషంగా జీవించమని చెప్పాను’’ అని ట్వీట్ చేశారు. స్టాలిన్ షేర్ చేసిన వీడియోలో.. పెరరివలన్‌కు స్టాలిన్ శాలువా కప్పి అభినందించారు. అనంతరం అతడిని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. పెరరివలన్‌తో పాటు అతడి తల్లి, ఇతర కుటుంబీకులు స్టాలిన్‌ను కలవడానికి వచ్చారు.