Home > Featured > పోలీస్ శివుడు.. మెడలో పాము హారం(వీడియో)

పోలీస్ శివుడు.. మెడలో పాము హారం(వీడియో)

పాము కనిపిస్తే పది మీటర్లు పరుగెత్తుతారు. పాము నుంచి రక్షణ కావాలని ఎవరూ పోలీసులకు ఫోన్ చేయరు. పాములు పట్టేవారికే ఫోన్ చేస్తారు. ఇకనుంచి ఆ పరిసర ప్రాంతాల్లో అలాంటి ఆపద ఎవరికైనా వస్తే ఈ పోలీస్‌కే ఫోన్ చేస్తారు. ఎందుకంటారా.. విషపూరితమైన పాము అని తెలిసికూడా ఆ పోలీస్ పామును పట్టుకున్నాడు. అది మెడలో చుట్టుకున్నా అస్సలు జంకలేదు. దాన్నలా మెడలో వేసుకుని వెళ్లి దూరంగా పొదల్లో వదిలేశాడు. స్థానికులంతా అతను అలా చేయడాన్ని చూసి ఈ పోలీస్ మానవ రూపంలో వున్న శివుడే అంటున్నారు. ఈ విచిత్ర ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో జరిగింది.

రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టు పైకి ఎక్కిన పాము ఓ కొమ్మకు తన తోకను చుట్టుకుని వేలాడుతోంది. ఇది గమనించిన చుట్టుపక్కల జనాలు అంతదూరం పరుగులు పెట్టారు. అది చెట్లు ఎక్కి మనుషుల పైకి దూకి కాటేస్తుందని జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. కానీ, వీరవనలూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్యాంసన్ మాత్రం దాన్ని చూసి చిరునవ్వుతో దాని దగ్గరకు వెళ్లాడు. చూస్తున్నవాళ్లంతా ఆ పామును ఆయన తన రివాల్వర్‌తో షూట్ చేసి చంపేస్తారని అనుకున్నారు. కానీ, ఆ ఇన్‌స్పెక్టర్ దాని వద్దకు వెళ్లి తోకను నేర్పుగా పట్టుకున్నాడు. ఆ వెంటనే అది అతని మెడ మీదుగా తలపైకి చేరింది. అది ఎక్కడ కాటేస్తుందోనని జనాలు మరింత బెంబేలెత్తిపోసాగారు.

అనంతరం పాముతో సహా కొంత దూరం అలాగే నడుచుకుంటూ వెళ్లి.. దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతంలో దాన్ని విడిచిపెట్టాడు. ఈ తతంగాన్నంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాములు అంటే తనకు భయం లేదని, వాటిని పట్టుకోవడం తనకు చిన్నతనం నుంచే అలవాటైందని సదరు పోలీస్ తెలిపాడు. ఇకనుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాములు వస్తే మిమ్మల్నే సంప్రదిస్తారని స్థానికులు అన్నారు. దానికి ఆయన సరేనన్నాడు.

Updated : 9 Sep 2019 7:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top